News December 26, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ నర్సీపట్నంలో గంజాయి లేడీ డాన్‌తో సహా ఎనిమిది మంది అరెస్ట్
➤ జిల్లాలో పలుచోట్ల వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు
➤ పాయకరావుపేటలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
➤ షిప్ బోటును ఢీకొన్న ఘటనలో మత్స్యకారుడు గల్లంతు
➤ స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు
➤ మాడుగుల నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరు
➤ మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు.
Similar News
News December 30, 2025
హమాస్‌కు నరకమే.. ట్రంప్ హెచ్చరికలు

ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ ఒప్పుకోకపోతే నరకం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ సంస్థకు కొద్ది సమయం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి నిరాయుధీకరణ చాలా ముఖ్యమని చెప్పారు. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాము దాడులకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.
News December 30, 2025
2025లో ఎన్ని డ్రంక్&డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే..!

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. 2025లో మొత్తం 10,833 డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని చెప్పారు. హెల్మెట్ వినియోగం, ఓవర్ స్పీడ్, మద్యం తాగి వాహనం నడిపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
News December 30, 2025
వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ <<18708686>>వేకువజామున<<>> శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తర్వాత VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. 5.30AM నుంచి ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన వారిని అనుమతివ్వనున్నారు. సోమవారం రాత్రి వరకు 55వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు అంచనా. TG CM రేవంత్ రెడ్డి, పలువురు AP మంత్రులు సహా పెద్ద సంఖ్యలో VIPలు చేరుకున్నారు.


