News April 24, 2024

పెద్దకడబూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామ శివారులోని ఎల్లెల్సి సమీపంలో జాతీయ రహదారిలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. గుడేకల్ గ్రామానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 14, 2026

10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్: కలెక్టర్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠినంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

News March 14, 2026

కర్నూలు జిల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

జోహారాపురం సచివాలయంలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. ఈ పథకం కింద కర్నూలు జిల్లాలోని 2,72,757 మంది అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ.154.94 కోట్లు జమ చేసిందని కలెక్టర్ తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె వివరించారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.6వేలు జమవుతుందని తెలిపారు.

News March 14, 2026

కర్నూలు జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే..!

image

ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని కర్నూలు డీఈవో సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూళ్లు ఉదయం 7:45 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థికి భోజన వసతిని కల్పించాలన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.