News December 27, 2025
పరకామణి కేసు.. HCకి ఏసీబీ మధ్యంతర నివేదిక

AP: టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఇవాళ హైకోర్టుకు మధ్యంతర నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. కేసు పరిస్థితుల ఆధారంగా మరో FIR నమోదు చేయాల్సిన అవసరం ఉందని, సీఐడీ దీన్ని పరిశీలించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.
Similar News
News January 8, 2026
అసెంబ్లీకి రాని వైసీపీ MLAలకు నోటీసులు!

AP: అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగా వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. నిపుణుల అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు.
News January 8, 2026
వామ్మో.. నాటుకోడి కేజీ రూ.2,500

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ. దీంతో కేజీ కోడి ధర రూ.2,000-2,500(గతంలో రూ.1,000-1,200) పలుకుతోంది. వైరస్‌ల కారణంగా నాటుకోళ్లను పెంచే వారి సంఖ్య తగ్గిపోవడంతో కొరత ఏర్పడింది. ఇదే అదునుగా యజమానులు రేట్లు భారీగా పెంచేశారు. అటు బ్రాయిలర్ చికెన్ రేటు కూడా రూ.300-350 పలుకుతోంది.
News January 8, 2026
చలి పంజా.. జి.మాడుగులలో 2.7 డిగ్రీలు

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. నిన్న ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 2.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. అటు TGలోని ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 7.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. ADB, నిర్మల్, ASFB, మంచిర్యాల, MDK, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.


