News December 27, 2025
గంజాయి వినియోగంపై ఉక్కుపాదం: ఎస్పీ

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. గంజాయి వినియోగించే 71 ప్రాంతాలను గుర్తించామని, ‘ఈగల్ టీం’ సమర్థంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, జిల్లాలో గంజాయి ఉత్పత్తులను పూర్తిగా అరికట్టామన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, నిఘా ముమ్మరం చేశామని ఆయన వివరించారు.
Similar News
News January 16, 2026
UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.
News January 16, 2026
విజయ్ హజారే ట్రోఫీ.. పైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ క్రికెట్ జట్టు కర్ణాటకపై ఘన విజయాన్ని సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 280 పరుగులు చేసింది. దర్శన్ నల్కాండే ఐదు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో విదర్భ యువ బ్యాటర్ అమన్ మొఖాడే 138 రన్స్‌తో సత్తా చాటారు. మరోవైపు ఈరోజు పంజాబ్-సౌరాష్ట్ర మధ్య మరో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధించిన టీమ్ 18వ తేదీన విదర్భతో ఫైనల్‌లో తలపడనుంది.
News January 16, 2026
52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్.. సీక్రెట్ చెప్పిన సోనూ సూద్

52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు నటుడు సోనూ సూద్. తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లేవగానే గోరువెచ్చని నీరు తాగుతానని, అనంతరం రోజూ గంటపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో, ఇతర వర్కౌట్స్‌తో పాటు ధ్యానం చేస్తానని తెలిపారు. పెద్దగా డైట్ ఫాలో అవ్వనని, హోమ్ ఫుడ్‌ని లిమిటెడ్‌గా తీసుకుంటానని వెల్లడించారు. ఇక షూటింగ్‌లలో ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటానని అన్నారు.


