News April 24, 2024
ఓటు హక్కు వినియోగం ప్రతి ఒక్కరి కర్తవ్యం: ఢిల్లీరావు

ఓటు హక్కు వినియోగం.. ప్రతి ఒక్కరి కర్తవ్యమని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందీరా గాంధీ స్టేడియంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్లో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు తప్పనిసరిగా నైతిక బాధ్యతగా మే 13న ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 30, 2025
నిబంధనలు పాటించాలి: ఎస్పీ విద్యాసాగర్

కృష్ణా జిల్లా ప్రజలకు ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026ను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో అశాంతి, మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్, డీజేలు, చట్టవిరుద్ధ కార్యక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసు తనిఖీలు, పికెట్లు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.
News December 30, 2025
పరిశ్రమల స్థాపనే లక్ష్యం: కలెక్టర్ బాలాజీ

పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు పొందిన యూనిట్ల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కానూరులో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, సాధ్యమైన వాటిని తక్షణమే పరిష్కరించారు. పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీలు సకాలంలో అందించి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు.
News December 30, 2025
REWIND 2025: కృష్ణా జిల్లా ఖ్యాతిని చాటిన ప్రతిభా విజయాలు

* కృష్ణాజిల్లా పరిషత్‌కు ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా అవార్డు
* ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన పాలడుగు శివకి గద్దర్ అవార్డు
* USA 2025 కిరీటం దగ్గించుకున్న గుడివాడ వాసి మౌనిక అట్లూరి
* కూచిపూడిలో జరిగిన యోగాకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
* ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యాపకులకు జాతీయస్థాయి అవార్డులు


