News December 27, 2025
STU రాజంపేట రీజనల్ కన్వీనర్‌గా రవిశంకర్

స్టేట్ టీచర్స్ యూనియన్(STU) రాజంపేట రీజనల్ కన్వీనర్‌గా రవిశంకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన నల్లపరెడ్డి పల్లి జడ్పీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 14, 2026
HNK: సెమీస్‌కు ఒడిశా.. తెలుగు జట్ల నిష్క్రమణ

కాజీపేటలో జరుగుతున్న 58వ సీనియర్ నేషనల్ ఖోఖో పోటీల్లో తెలుగు రాష్ట్రాల జట్ల ప్రస్థానం ముగిసింది. ప్రీ-క్వార్టర్స్‌లో తెలంగాణ, AP జట్ల మధ్య జరిగిన రసవత్తర పోరులో ఏపీ(28-21) విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మహారాష్ట్ర చేతిలో ఆంధ్ర జట్టు(16-23) ఓటమి చవిచూసింది. అటు ఒడిశా పురుషుల, మహిళల జట్లు అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు దూసుకెళ్లాయి. గురువారం సెమీస్, ఫైనల్స్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
News January 14, 2026
చితిపై నుంచి లేచిన బామ్మ.. ఆ తర్వాత..

మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలో వింత ఘటన జరిగింది. 103 ఏళ్ల గంగాబాయి చనిపోయిందని కుటుంబసభ్యులు భావించి.. బంధువులకు కబురు పంపారు. ముక్కులో దూది పెట్టి అంతిమ యాత్రకు సిద్ధమయ్యారు. ఇంతలో ముడివేసిన గంగాబాయి కాలి వేళ్లు కదలడాన్ని మనవడు గమనించాడు. వెంటనే దూది తీసేయగా ఆమె లోతుగా శ్వాస తీసుకుంది. అదేరోజు గంగాబాయి పుట్టినరోజు కావడం విశేషం. దీంతో వీడ్కోలుకు వచ్చినవారు హ్యాపీగా కేక్ తిని వెళ్లిపోయారు.
News January 14, 2026
బస్సులో ప్రయాణించిన మంత్రి సురేఖ

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐనవోలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో మంత్రి సురేఖ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ టికెట్ పొంది ప్రయాణించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.


