News April 24, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారు: జగదీశ్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీ కోసం ప్రధాని మోదీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నామినేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని 16 స్థానాల్లో తామే ముందంజలో ఉన్నామన్నారు. భువనగిరి, నల్గొండ స్థానాలలో బీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు.

Similar News

News March 24, 2026

సేద్యంపై ‘శాపం’.. ఎండిపోతున్న పైర్లు

image

నల్గొండ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అల్లాడిపోతున్నారు. మునుగోడు మండలం ఉకోండిలో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు పోయక పరిస్థితి దారుణంగా మారింది. చేతికొచ్చే దశలో వరి, ఇతర పంటలు ఎండుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీటి ఇబ్బందులను తొలగించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

News March 24, 2026

NLG: ఖర్చుల లెక్కల్లో ‘నిర్లక్ష్యం’

image

జిల్లాలోని పురపాలక ఎన్నికలు ముగిసి నెల రోజులు కావస్తున్నా, పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామంది తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. NLG కార్పొరేషన్‌తో పాటు మిగిలిన 6 మున్సిపాలిటీల్లోని మెజారిటీ అభ్యర్థులు గడువు ముగుస్తున్నా లెక్కలు చెప్పకపోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. NLG జిల్లాలో ఇప్పటివరకు కేవలం 40% అభ్యర్థులు మాత్రమే లెక్కలు అప్పగించినట్లు సమాచారం.

News March 24, 2026

వంటగ్యాస్ కటకట.. బ్లాక్‌లో విక్రయాల జోరు!

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో జిల్లాలో వంటగ్యాస్ సరఫరా అస్తవ్యస్తమైంది. వాణిజ్య సిలిండర్ల పంపిణీ నిలిచిపోవడంతో గృహ వినియోగ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఇదే అదనుగా కొందరు డెలివరీ బాయ్స్, హోటల్ నిర్వాహకులు కుమ్మక్కై అక్రమ దందాలకు తెరలేపారు. ఒక్కో సిలిండర్‌ను రూ. 2,500 వరకు విక్రయిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. అధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.