News April 24, 2024

మైదుకూరు: RTC బస్సు ఢీ కొట్టడంతో విలేకరి మృతి

image

మైదుకూరు మండలం మిట్టమానుపల్లె సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రహ్మంగారిమఠం మండలం గోడ్లవీడుకు చెందిన ఉప్పలూరు గురవయ్య ఓ న్యూస్ ఛానల్‌లో విలేకరిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఆయన బ్రహ్మంగారిమఠం నుంచి మైదుకూరు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 20, 2026

కడప: Way2News ఎఫెక్ట్.. ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లలో దోపిడీకి తెర.!

image

కడప జిల్లాలో మార్క్‌ఫెడ్ 21 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిని DCMS నిర్వహిస్తోంది. ఇక్కడి ఇన్‌ఛార్జ్‌లు రైతుల నుంచి బస్తాకు రూ.150-200లు దోపిడీ చేస్తున్నారు. దీనిపై Way2Newలో వీడియోలతో సహా వరుస కథనాలు ప్రచురించింది. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో క్వింటాలకు రూ.75లు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.

News March 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,770
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,588
*వెండి 10 గ్రాముల ధర రూ.2,370

News March 20, 2026

కడప జిల్లాలో 10th ఇంగ్లిష్ పరీక్ష వాయిదా.!

image

రాష్ట్ర ప్రభుత్వం శనివారం రంజాన్ సందర్భంగా సెలవు ప్రకటించింది. దీంతో ఆ రోజున జరగవలసిన పదవ తరగతి ఇంగ్లిష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఏప్రిల్ 2న ఇంగ్లిష్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంగ్లిష్ పరీక్ష వాయిదాను గమనించాలని పేర్కొంది.