News December 27, 2025
విద్యుత్ కష్టాలకు చెక్.. అయినవిల్లిలో భారీ సబ్‌స్టేషన్!

జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అయినవిల్లిలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్‌స్టేషన్ మైలురాయిగా నిలుస్తుందని కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లో-వోల్టేజ్ సమస్యలను అధిగమించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టును జిల్లాకే తలమానికంగా చేపడుతున్నట్లు తెలిపారు.
Similar News
News January 1, 2026
రూ.20కే గోధుమపిండి.. పంపిణీ ప్రారంభం

AP: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు గోధుమపిండి పంపిణీ ప్రారంభమైంది. నేటి నుంచి బియ్యం, పంచదారతో పాటు గోధుమపిండి, జొన్నలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కిలో పిండి రూ.20కే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 6 జిల్లాల్లో అమలు చేస్తున్నామని, వచ్చే నెల మరో 2 జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. ఈ చక్కీ గోధుమపిండి పిల్లలు, వృద్ధులకు న్యూట్రిషన్ ఫుడ్‌గా ఉపయోగపడుతుందని, ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు.
News January 1, 2026
క్షయ వ్యాధి రహిత జిల్లానే లక్ష్యం: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాను క్షయ వ్యాధి (టీబీ) రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పెనుకొండ టీబీ యూనిట్ పరిధిలోని 10 మంది టీబీ రోగులను ‘నిక్షయ్ మిత్ర’ పథకం కింద దత్తత తీసుకున్నారు. వారికి అవసరమైన పోషకాహార కిట్లను కలెక్టర్ అందజేశారు.
News January 1, 2026
పెన్షనర్లకు అలర్ట్.. ఫిబ్రవరిలోగా లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి!

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫిబ్రవరి 28 లోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని డీటీఓ ఎన్. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం RJY జిల్లా ఖజానా కార్యాలయంలో ఈ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. గడువులోగా ధ్రువీకరణ పత్రాలు అందజేయని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


