News April 24, 2024
హిరమండలం:అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

హిరమండలం రెల్లివీధికి చెందిన కళింగపట్నం ధనుంజయ(26) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ధనుంజయకు రూ.5000 అప్పుగా ఇచ్చిన పందిరి రాజా అనే వ్యక్తి, అతని అనుచరులు అప్పు తీర్చమని ఇటీవల దారుణంగా కొట్టి, ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. వేధింపులకు భయపడి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు తండ్రి భూలోకం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News October 26, 2025
శ్రీకాకుళం: విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు

జిల్లాలోని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్ ఆదివారం తెలిపారు. తుపాన్ కారణంగా ఈనెల 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించామన్నారు. మూడు రోజుల పాటు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు బయట తిరగొద్దని సూచించారు.
News October 26, 2025
కోటబొమ్మాళి: బావిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

కోటబొమ్మాళి మండలం ఉప్పరపేటకు చెందిన దండుపాటి గౌరి నాయుడు ఆదివారం బావిలో పడి మరణించాడు. స్థానికుల వివరాల మేరకు.. గౌరి నాయుడు ఆదివారం బావిలోకి స్నానం చేసేందుకు దిగి అస్వస్థతకు గురయ్యాడు. 108లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News October 26, 2025
SKLM: నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు

నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల31న జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంవద్ద ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలియజేశారు. ITI అర్హత కలిగి ఎలక్ట్రిషన్‌లో అనుభవం ఉండాలన్నారు. 30 ఏళ్లు కలిగి https://apssdc.inloలో నమోదు చేసుకోవాలన్నారు.


