News December 27, 2025

కర్నూలు జిల్లాలో 17,089 ఓపెన్ డ్రింకింగ్ కేసులు: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 17,089 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇకపై బహిరంగ మద్యపానాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

Similar News

News December 28, 2025

విక్రాంత్ పాటిల్ ప్రస్థానం: ఎస్పీ నుంచి డీఐజీ వరకు

image

కర్నూలు ఎస్పీగా సేవలు అందిస్తున్న విక్రాంత్ పాటిల్ 2012 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఏపీలో కీలక బాధ్యతలు నిర్వహించి డీఐజీగా పదోన్నతి పొందారు. విజయనగరం అదనపు ఎస్పీగా కెరీర్ ప్రారంభించి చిత్తూరు రైల్వే ఎస్పీగా, విజయవాడ డీసీపీగా సేవలందించారు. పార్వతీపురం, కాకినాడ ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం కర్నూలు ఎస్పీగా ఉన్న ఆయనకు డీఐజీగా పదోన్నతి లభించడంపై పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

News December 28, 2025

14వ స్థానంలో కర్నూలు జిల్లా.!

image

అన్ని పోలింగ్ కేంద్రాలకు రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను తక్షణమే నియమించుకోవాలని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి శనివారం ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో BLOలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఓటర్ల మ్యాపింగ్‌లో జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో ఉందని, జనవరి చివరికి గ్రామాల్లో 75%, పట్టణాల్లో 85% మ్యాపింగ్ పూర్తిచేస్తామన్నారు. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు BLOలను సస్పెండ్ చేశామన్నారు.

News December 28, 2025

ఇండీ–గ్యాప్ సర్టిఫికేషన్‌కు అవకాశం: JDA

image

కర్నూలు జిల్లాలో రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులు పండించిన రైతులకు ఇండీ–గ్యాప్ దృవీకరణ పత్రాలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లాలో 24 మంది రైతులకు ఈ అవకాశం లభించిందని శనివారం అన్నారు. ఒక్కో రైతుకు ఖర్చయ్యే రూ.77,100లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.