News December 27, 2025
TTD సిబ్బందిపై చర్యలు

తిరుపతి SGS పాఠశాల విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం సైతం ఉండగా వారిపై చర్యలు తీసుకోలేదు. ఇదే విషయం Way2Newsలో వార్తగా రావడంతో TTD డీఈవో స్పందించారు. పాఠశాల HM చంద్రయ్యతో సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఇచ్చిన సిబ్బంది ఇద్దరిని బదిలీ చేయనున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని తిరిగి క్లాస్‌లకు అనుమతించనున్నారు.
Similar News
News January 4, 2026
ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియాలో పోస్టులు

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News January 4, 2026
‘జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే?’.. ట్రంప్‌పై రో ఖన్నా ఫైర్!

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌ను భారత సంతతి US MP రో ఖన్నా తప్పుబట్టారు. ఇది ఒక అనవసర యుద్ధమని విమర్శించారు. ‘ఇలాంటి దాడుల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే? లేదా తైవాన్ నేతలపై చైనా దాడి చేస్తే అప్పుడు మనం ఏమనగలం?’ అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా నైతిక బలాన్ని కోల్పోతుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.
News January 4, 2026
చిత్తూరు: ఉపాధిపై రేపు గ్రామసభలు

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని చెప్పారు. పథకంపై సభలలో అవగాహన కల్పిస్తామన్నారు.


