News December 27, 2025

నేటి నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) హాల్ టికెట్లు ఇవాళ 11am తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పారు. అభ్యర్థులు <>schooledu.telangana.gov.in<<>>లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. JAN 3-20వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. 9am నుంచి 11.30am వరకు, 2pm నుంచి 4.30pm వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌కు 2,37,754 మంది అప్లై చేసుకున్నారు.

Similar News

News December 29, 2025

మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్

image

AP: <<18702293>>రాయచోటి<<>>ని జిల్లా కేంద్రంగా తొలగించడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాంప్రసాద్‌రెడ్డితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ‘విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మీరు పోరాడుతున్నారు. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేసే వీలులేకే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు. రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు CM హామీ ఇచ్చారు.

News December 29, 2025

T20Iల్లో సంచలనం.. 4 ఓవర్లలో 8 వికెట్లు

image

T20Iలో భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే రికార్డు సృష్టించారు. మయన్మార్‌తో జరిగిన మూడో T20Iలో 22 ఏళ్ల సోనమ్ నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీశారు. టీ20 ఫార్మాట్‌లో ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ 45 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత్ నుంచి దీపక్ చాహర్ 2019లో ఒక T20 మ్యాచ్‌లో 6 వికెట్లు తీశారు.

News December 29, 2025

టమాటా కాయలపై చిన్న చిన్న రంధ్రాలకు కారణమేంటి?

image

కొన్ని టమాటా కాయలను పరిశీలిస్తే వాటిపై చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. దీనికి కారణం సూది పురుగు. ఇది చిన్న గొంగళి పురుగు రూపంలో ఉండి, ఆకులలో సొరంగాలను చేసి, పండ్లలో చిన్న రంధ్రాలు చేసి లోపల తింటుంది. ఈ పురుగుల వల్ల పండ్లు రంగు మారి, పాడైపోతాయి. సూది పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ml లేదా ప్లూబెండమైడ్ 0.2ml కలిపి పిచికారీ చేయాలి.