News December 27, 2025
నేడు CWC కీలక భేటీ

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు. ఈ భేటీలో ‘వీబీ-జీ రామ్ జీ’ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై ముఖ్యంగా చర్చించే అవకాశముంది. అలాగే త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ స్ట్రాటజీ ఖరారు చేయనున్నట్లు సమాచారం.
Similar News
News January 3, 2026
గంజాయి తీసుకుంటూ దొరికిన BJP MLA కుమారుడు

TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో BJP ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్‌రామ్‌గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించింది.
News January 3, 2026
మీడియా ముందుకు దేవా

TG: రాష్ట్రంలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయినట్లు DGP శివధర్ రెడ్డి పేర్కొన్నారు. కీలక నేతలు బర్సే దేవా, కంకనాల రాజిరెడ్డి, రేమలతో పాటు మరో 17మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. వారు 48 తుపాకులు, 93 మ్యాగ్జిన్లు, 2206 బుల్లెట్స్, రూ.20,30,000 నగదు అప్పగించినట్లు వెల్లడించారు. దేవాపై రూ.75లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు.
News January 3, 2026
IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో ఉద్యోగాలు

<


