News April 24, 2024
పెదపారుపూడి: చెరువులో పడవ బోల్తా పడి.. యువకుడి మృతి

మండలంలోని తంబలంపాడు గ్రామంలో నరసింహారావు పొలంలో చేపల చెరువు మేత వేయడానికి వెళ్లిన వల్లూరి విజయబాబు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై చంటిబాబు తెలిపారు. బాపులపాడు మండలానికి చెందిన విజయ్ కుమార్ చేపల చెరువు వద్ద కాపలా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మేత వేసేందుకు పడవలో వెళ్లగా, పడవ బోల్తా పడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై వెల్లడించారు.
Similar News
News September 11, 2025
మచిలీపట్నం-విజయవాడ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 11, 2025
కృష్ణా జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ ఫెన్సింగ్ జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ జట్ల ఎంపికలను కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడా కారులు పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో పీఈటీలు నాగరాజు, దీపా, వెంకట్రావ్ పాల్గొన్నారు.
News September 11, 2025
కృష్ణా: ప్రారంభమైన జెడ్పీ సర్వసభ్య సమావేశం

కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్‌తోపాటు మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభమైంది.