News December 27, 2025
జగిత్యాల: మొన్నే పోస్టింగ్.. ఇంతలోనే గుండెపోటుతో మృతి

జగిత్యాల జిల్లా వైద్యాధికారి(DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 4:30 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇటీవలే జిల్లా వైద్యాధికారిగా నియమితులైన శ్రీనివాస్ మృతి చెందడంతో వైద్య వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
Similar News
News December 30, 2025
తిరుపతి జిల్లాలో నౌకల తయారీ కేంద్రం

మీరు చదివింది నిజమే. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు తిరుపతి జిల్లాకు రానుంది. మనకూ ఓ పోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతి జిల్లాలోనే ఉంచారు. ఆ రెండు మండలాల పరిధిలో దుగరాజపట్నం పోర్ట్ నిర్మిస్తారు. ఇక్కడే షిప్ బిల్డింగ్ స్కీం కింద నౌకల తయారీ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నిన్నటి క్యాబినెట్ సమావేశంలో వెల్లడించారు.
News December 30, 2025
చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని.. మృత్యువులోనూ..

US యాక్సిడెంట్‌లో ఇద్దరు యువతులు మరణించడంతో పేరెంట్స్ గుండెలు బాదుకుంటున్నారు. మహబూబాబాద్(D)కు చెందిన <<18701423>>మేఘన<<>> (25), భావన(24) చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. మూడేళ్ల క్రితం USకు వెళ్లి డేటన్ యూనివర్సిటీలో MS చేశారు. సోమవారం మరో ఇద్దరు ఫ్రెండ్స్ (HYD)తో కలిసి యాత్రకు వెళ్లారు. కారు లోయలో పడటంతో మేఘన, భావన మరణించగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
News December 30, 2025
బాపట్ల ఆశుకవితా మూర్తులు: కొప్పరపు సోదర కవులు

సంతమాగులూరు(M) కొప్పరానికి చెందిన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, వేంకటరమణ కవి తెలుగు సాహిత్య చరిత్రలో ‘కొప్పరపు సోదర కవులు’గా ప్రసిద్ధి చెందారు. ఆశుకవిత్వంలో (అప్పటికప్పుడు పద్యం చెప్పడం) వీరిది తిరుగులేని వేగం. గంటకు 500 నుంచి 700 పద్యాలను ప్రవాహంలా చెప్పగలగడం వీరి ప్రత్యేకత. ఆనాటి ఉద్దండ పండితులైన తిరుపతి వేంకట కవులకు వీరు గట్టి పోటీదారులు. డిసెంబర్ 30 మంగళవారం వేంకటరమణ కవి జయంతి కావడం విశేషం.


