News December 27, 2025

ప.గో: ‘పందెం కోడిలా జగన్‌పై పోరాడతా’

image

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే తన ఏకైక లక్ష్యమని, ఎవరి మద్దతు లేకుండా ఒంటరిగానే పందెం కోడిలా పోరాడతానని డిప్యూటీ స్పీకర్ RRR స్పష్టం చేశారు. ఉండిలో అభివృద్ధి పనుల కోసం కాలువ గట్లపై ఉన్న కట్టడాలను తొలగిస్తుంటే కేవలం చర్చిలను మాత్రమే తొలగిస్తున్నట్లు జగన్ అనుకూల వెబ్ జర్నలిస్టులు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఉన్నా అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు

Similar News

News January 10, 2026

అనకాపల్లి: ఆ ఊరు రూపురేఖలే మారిపోతున్నాయ్!

image

నక్కపల్లి మండలం విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల రూప రేఖలు మారిపోతున్నాయి. త్వరలో ఇక్కడ ఆర్సిలర్ మిట్టల్ – నిప్పన్ కంపెనీలు సంయుక్తంగా భారీ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాజయ్యపేట, బోయపాడు పరిసర గ్రామాలలో కారిడార్ భూముల్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. విశాలమైన రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

News January 10, 2026

ప.గో: రైల్వేస్టేషన్‌కు దారి అడిగి.. మెడలో గొలుసు లాగారు!

image

నరసాపురం రోడ్డులో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. థామస్ బ్రిడ్జి సమీపంలో ఓ వృద్ధురాలు నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రైల్వేస్టేషన్ దారి అడిగారు. ఆమె వివరిస్తుండగా మెడలోని బంగారు ఆభరణాలు లాక్కొనే ప్రయత్నం చేశారు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో గొలుసు తెగి కొంతభాగం వారి చేతికి చిక్కింది. దుండగులు అక్కడి నుంచి పరారయ్యాడు.

News January 10, 2026

అన్నమయ్య జిల్లాకు కొత్త ఆఫీసర్

image

అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా ఆదినారాయణ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుమల నుంచి బదిలీపై ఆయన వచ్చారు. జిల్లా పరిధిలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక శాఖ పనితీరు, అత్యవసర సేవలు, భద్రత చర్యలపై చర్చించారు. ఇంతకుముందు అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు.