News December 27, 2025
ఖమ్మం జిల్లాలో జాడలేని ఇన్‌ఛార్జ్ మంత్రి..?

ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరి ఇప్పటి వరకు జిల్లా వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ శాఖలకే పరిమితం కావడంతో, అన్ని శాఖల సమన్వయంతో జరగాల్సిన సమీక్షలు నిలిచిపోయాయి. జిల్లాలో అనేక సమస్యలు పెండింగ్‌లో పడ్డాయి. అధికారుల్లో జవాబుదారీతనం లోపించిందని, ఇన్-ఛార్జ్ మంత్రి ఉన్నారన్న ఊసే లేదని ప్రజలు, విశ్లేషకులు మండిపడుతున్నారు.
Similar News
News December 28, 2025
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే..

రాత్రి సరిగా నిద్ర రావడం లేదని బాధపడేవారు పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. పాలలో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే కాల్షియం, విటమిన్ D, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
News December 28, 2025
రేపు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లీనిక్ ఏర్పాటు: కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సోమవారం నుంచి రెవిన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఆదివారం తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల MROలు, గుంటూరు రెవిన్యూ డివిజనల్ అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ గ్రామస్థాయి రికార్డులతో హాజరవుతారన్నారు. మండలాల వారీగా కౌంటర్లు ఉంటాయన్నారు.
News December 28, 2025
బంగ్లాదేశ్‌లో దాడులను అందరూ వ్యతిరేకించాలి: అమెరికా

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ఖండించింది. ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని ఓ ముఠా హత్య చేసిన ఘటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన ఘటనలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాల భద్రత కోసం యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.


