News December 27, 2025
ఆళ్లగడ్డ: నిద్రమత్తు ఐదుగురిని బలితీసుకుంది!

ఆళ్లగడ్డ మం. నల్లగట్ల వద్ద జరిగిన ప్రమాదానికి విశ్రాంతి లేని ప్రయాణమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. HYDకు చెందిన క్యాటరింగ్ బృందం తిరుమల నుంచి <<18673522>>కారులో<<>> తిరుగు ప్రయాణమవగా, డ్రైవర్ శివసాయి నిద్రమత్తులో కునుకు తీయడంతో వాహనం డివైడర్‌ను దాటి బస్సును ఢీకొంది. ఘటనలో గుండెరావు, నరసింహ, శ్రవణ్, సిద్దప్ప, సిద్ధార్థ మరణించారు. టోల్‌ప్లాజా వద్ద పోలీసుల సూచన మేరకు ‘ఫేస్‌వాష్’ చేసుకున్నా ప్రమాదం తప్పేది.
Similar News
News January 5, 2026
ఓయూ డిగ్రీ పరీక్షా తేదీలు వచ్చేశాయ్!

ఓయూ పరిధిలో జరిగే వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షా తేదీలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శశికాంత్ తెలిపారు. BA, BSW, BCom, BSc, BBA రెగ్యులర్ కోర్సుల మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలతో పాటు MA, MCom, MSc, MSW, MLIC, MJ& MC రెగ్యులర్ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
News January 5, 2026
కలుషిత నీరు.. 17కి చేరిన మరణాలు

ఇండోర్ భగీరథ్‌పురలో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి మరణించిన వారి సంఖ్య 17కి పెరిగింది. తాజాగా ఓం ప్రకాశ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మృతిచెందారు. ఇప్పటివరకు 398 మంది ఆస్పత్రిలో చేరగా 256 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం రేపు కోర్టులో నివేదిక ఇవ్వనుంది. మంచినీటి పైప్ లైన్‌లో మురుగునీరు కలవడమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
News January 5, 2026
రోజూ 8-10 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-30 కేజీల పచ్చగడ్డి, 4-5 కేజీల ఎండుగడ్డి, 4 నుంచి 4.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.


