News December 27, 2025

కేరళ రాజధానిలో కాషాయ జెండా

image

కేరళలో కాషాయ దళం సరికొత్త అధ్యాయం లిఖించింది. నాలుగు దశాబ్దాలుగా LDF ఆధిపత్యంలో ఉన్న <<18552178>>తిరువనంతపురం<<>> మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని తొలిసారి మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. BJP రాష్ట్ర కార్యదర్శి, కొడుంగనూర్ కౌన్సిలర్ V.V.రాజేశ్ 51 ఓట్లతో మేయర్‌గా ఎన్నికయ్యారు. LDFకి 29, UDFకి 19 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విజయం కేరళ రాజకీయ సమీకరణాలను మార్చే కీలక మలుపుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Similar News

News January 10, 2026

అమరావతిపై జగన్ అడిగింది అదే: సజ్జల

image

AP: CM CBN చెబుతున్న అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని YCP స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల ఆరోపించారు. ‘పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచుతున్నారు. అంత డబ్బు అవసరమా? అని మాత్రమే జగన్ అడిగారు. అమరావతిపై ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రాజధాని పేరుతో జగన్‌ను దూషిస్తున్నారు. అమరావతి టెండర్లలో కొన్ని కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి సమాధానం చెప్పట్లేదు’ అని విమర్శించారు.

News January 10, 2026

సుధామూర్తి చెప్పిన పేరెంటింగ్ సూత్రాలు

image

ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది సవాలుగా మారుతోంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు చాలా విషయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం, పుస్తకాలు చదివించడం, సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పడం, పెట్టాల్సిన చోట హద్దులు పెడుతూనే ఇవ్వాల్సిన చోట స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు పిల్లలకు పేరెంట్స్ రోల్‌మోడల్‌లా ఉండాలంటున్నారు.

News January 10, 2026

అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల

image

AP: అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రాజధానిలోనే జగన్ ఇల్లు, పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. CBN ఇంకా అక్రమ నివాసంలో ఉన్నారు. పాలనా వికేంద్రీకరణలోనూ అమరావతిని తక్కువ చేయలేదు’ అని తెలిపారు.