News December 27, 2025
WGL: గ్రామ పాలనలో మహిళా శక్తి!

జీపీ ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌తో జిల్లాలో 316 జీపీలకు ఎన్నికలు జరగగా 158 మంది మహిళలు సర్పంచులుగా గెలిచారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళామణులు తమ సత్తా చాటుకున్నారు. ఇక సర్పంచ్ స్థానాల్లో మగవారు నిలిచిన చోట ఉప సర్పంచ్ మహిళలకు, మహిళలు ఉన్న చోట మగవారికి అవకాశం వచ్చింది. పాలనపై పట్టులేకున్నా, కుటుంబ బాధ్యతలతో పాటు గ్రామాభివృద్ధి బాధ్యతను మోస్తామని మహిళా సర్పంచులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 12, 2026
ప్రజావాణిలో 129 వినతులు స్వీకరణ: వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌వో విజయలక్ష్మి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. మొత్తం 129 దరఖాస్తులు అందగా వాటిలో రెవెన్యూ సంబంధిత 52 ఉన్నాయి. భూ సమస్యలు, పింఛన్లు, గృహాలు, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
News January 12, 2026
వరంగల్: విద్యా సంస్థల నిర్మాణం వేగవంతం చేయాలి: భట్టి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని Dy.సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీల్లో ముందు వరుసలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.
News January 12, 2026
ప్రజావాణి వినతులు పరిష్కార దిశగా అడుగులు: వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో కలెక్టర్‌కు సమర్పించారు. మొత్తం 129 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 52, ఇతర శాఖలకు సంబంధించినవి 77 దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.


