News December 27, 2025

మేడారం దేవాదాయ శాఖ కిందకు రాదా ?

image

మేడారం మహా జాతరలో భాగంగా రూ.251 కోట్ల వ్యయంతో వన దేవతల గద్దెల ప్రతిష్ఠాపనతో పాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇలాంటి ఆదివాసీ ఇలవేల్పుల జాతరపై దేవాదాయ శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. తరచూ రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రులే రివ్యూ చేస్తుండగా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాత్రం దూరంగా ఉండటంతో మంత్రుల మధ్య గ్యాప్ ఇంకా పోలేదా? అనే సందేహాలు వస్తున్నాయి.

Similar News

News January 15, 2026

దేవరాపల్లి: పిండివంటలు చేస్తుండగా ప్రమాదం

image

దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిరవరపు స్వప్న గ్యాస్ పొయ్యిపై పిండివంటలు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌తో పాటు ఇతర గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.3.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 15, 2026

ఇరాన్ నో ఫ్లై జోన్.. ఇండిగో విమానం జస్ట్ మిస్!

image

ప్రభుత్వ వ్యతిరేక ఉద్రిక్తతల మధ్య గురువారం తెల్లవారుజామున ఇరాన్ తన గగనతలాన్ని అకస్మాత్తుగా మూసివేసింది. అయితే జార్జియా నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానం గగనతలం మూతపడటానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందే సురక్షితంగా బయటపడింది. ఆ ప్రాంతాన్ని దాటిన చివరి విదేశీ ప్యాసింజర్ విమానం ఇదే కావడం విశేషం. ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఎయిరిండియా సహా పలు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి.

News January 15, 2026

నిర్మల్: సీఎం పర్యటనపై ఆశలు

image

సీఎం ఈనెల 16న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ముంగిట పర్యటన నిర్మల్ నుంచే ప్రారంభం కానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రాకతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు, రాజకీయ వ్యూహరచనపై సీఎం దిశానిర్దేశం చేయనుండటంతో కేడర్‌లో ఉత్సాహం నెలకొంది.