News December 27, 2025
కామారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణహత్య..!

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం మోటాట్‌పల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఎర్రరాజు(32) హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 2, 2026
ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో శ్రీహ సత్తా

మధురైలో ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ డిసెంబర్ 30న ఐదో సారి నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ బిలో 1800 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,245 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అనంతపురం జిల్లా క్రీడాకారిణి శ్రీహ 9కి 7 పాయింట్లతో ఓపెన్ విభాగంలో 21వ స్థానాన్ని సాధించింది. గురువారం కోచ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీహ ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచిందన్నారు.
News January 2, 2026
ఎలాన్ మస్క్.. విరాళాల్లోనూ శ్రీమంతుడే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాను విరాళాల్లోనూ శ్రీమంతుడేనని నిరూపించారు. ఏకంగా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) విలువైన 2.10 లక్షల టెస్లా షేర్లను తన ఫౌండేషన్‌కు డొనేట్ చేశారు. 2024లో 112 మిలియన్ డాలర్లు, 2022లో 1.95 బిలియన్ డాలర్లు, 2021లో 5.74 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఛారిటీకి ఇచ్చారు. తాజా డొనేషన్ తర్వాత కూడా 619 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఆయన కొనసాగుతున్నారు.
News January 2, 2026
జనవరి 2: చరిత్రలో ఈరోజు

✒1954 : భారతరత్న పురస్కారం ప్రారంభం
✒1918: తెలంగాణకు చెందిన స్వాతంత్ర్య పోరాట యోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ జననం
✒1957: తెలుగు సినిమా హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (AVS) జననం (ఫొటోలో కుడివైపున)
✒1945: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు మరణం (ఫొటోలో ఎడమవైపున)
✒2015: భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత వసంత్ గోవారికర్ మరణం


