News December 27, 2025

గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి: డీఈఓ

image

ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని డీఈఓ కంది వాసుదేవరావు శనివారం తల్లిదండ్రులకు సూచించారు. కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రాథమిక తరగతులకు మాత్రమే గుర్తింపు ఉండి, ఉన్నత తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. గుర్తింపు లేని తరగతుల్లో చదివితే పైచదువులకు అవకాశం ఉండదని హెచ్చరించారు. విద్యాసంస్థల గుర్తింపును పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News December 30, 2025

మారనున్న తూర్పుగోదావరి రూపురేఖలు

image

కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఈ మూడు మండలాల ప్రజలు రాజమండ్రి ఆర్డీవో పరిధిలో సేవలు పొందనున్నారు. గత కొంతకాలంగా ఉన్న డిమాండ్ నెరవేరడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

News December 30, 2025

ప్రజల కోసమే పోలీసుల‌ సేవలు: ఎస్పీ

image

తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన అధికారులను మంగళవారం సన్మానించారు. ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ఎస్పీ డి. నరసింహ కిశోర్ హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన ఎస్సై డి. సత్యనారాయణ, ఎస్సై జి. రామకృష్ణ పరమహంస, ఎఎస్సై కే. జయలక్ష్మి, ఎఆర్ఎస్ఐ ఎం.రాధాకృష్ణలను ఎస్పీ సన్మానించారు. పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సర్వీసులో వారు అందించిన సేవలను కొనియాడారు.

News December 29, 2025

మంత్రితో సినీ దర్శకుల భేటీ.. పరిశ్రమ అభివృద్ధిపై చర్చలు!

image

విజయవాడలో పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అసోసియేషన్ బలోపేతం, సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పరిశ్రమ పురోభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.