News December 27, 2025

పెరిగిన ట్రైన్ ఛార్జీలు.. RGM-సికింద్రాబాద్‌‌కు ఎంతంటే..?

image

రైల్వే శాఖ రైళ్ల ఛార్జీలను పెంచింది. 215 KMలకు పైగా ట్రావెల్ చేసేవారిపై KMకు పైసా చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 224 KMల దూరమున్న రామగుండం- సికింద్రాబాద్‌(భాగ్యనగర్‌, ఇంటర్‌సిటీ) ట్రైన్లకు మొన్నటివరకు రూ.90 టికెట్ ధర ఉండగా పెరిగిన ధరతో అది రూ.95కు చేరింది. ఇక సూపర్‌ఫాస్ట్‌ ఛార్జ్ రూ.110గా ఉంది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. PDPL-సికింద్రాబాద్‌కు పాత ఛార్జీలే.

Similar News

News December 29, 2025

భిక్కనూర్: అన్నను చంపిన తమ్ముడి అరెస్టు

image

భిక్కనూర్ మండలం మోటాట్ పల్లిలో శనివారం ఎర్ర రాజు హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు శివ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. సోదరుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని చంపినట్లు నిండుతుడు ఒప్పుకొన్నుట్లు సీఐ చెప్పారు. అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

News December 29, 2025

చివరి దశలో చర్చలు.. ఏం జరుగుతుందో: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఏం జరుగుతుందో చూడాలని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కీలక చర్చల కోసం ఫ్లోరిడాకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఆయన ఆహ్వానించారు. 2 దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని చెప్పారు. పుతిన్, జెలెన్‌స్కీ ఒప్పందం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. భేటీకి ముందు ట్రంప్‌, పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. మీటింగ్ తర్వాతా మాట్లాడనున్నారు.

News December 29, 2025

కామారెడ్డి: వృద్ధురాలి హత్య.. నిందితుడి అరెస్ట్

image

వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఎల్లారెడ్డి DSP శ్రీనివాస్ రావు తెలిపిన వివరాలు.. లింగంపేట(M) పోల్కంపేటకు చెందిన సులోచన(67) ఈ నెల 27న తన ఇంట్లో రక్తపు గాయాలతో శవమై కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ముద్రబోయిన కుమార్ నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె నుంచి దొంగిలించిన 4 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునామన్నారు.