News December 27, 2025
ఏర్పేడు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. Ph.D ఇన్ ఫిజిక్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/Project_Positions వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 03.
Similar News
News January 14, 2026
కామారెడ్డి: గాలిపటం ఎగరేసిన ఎస్పీ

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర గాలిపటం ఎగరవేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సంబరాలు నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భోగిమంటలు నిర్వహించారు. అనంతరం కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర గాలిపటం ఎగరవేసి ఆకర్షణగా నిలిచారు.
News January 14, 2026
ఆమెకి రెండు యోనులు, రెండు గర్భాశయాలు

పుట్టుకతో రెండు యోనులు, రెండు గర్భాశయాలతో జన్మించిన యూపీలోని బల్లియా(D) యువతికి లక్నో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఆమెకి చిన్నప్పటి నుంచి మూత్ర విసర్జనపై నియంత్రణ ఉండేది కాదని, మలవిసర్జనలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు డాక్టర్లు తెలిపారు. మూత్ర నాళాలు అసాధారణ ప్రదేశాలలో తెరుచుకోవడంతో మూత్రం లీక్ అయ్యేదని పేర్కొన్నారు. 3 సర్జరీలు చేసి ఈ అరుదైన సమస్యను పరిష్కరించారు.
News January 14, 2026
BREAKING.. నల్గొండ ఇక కార్పొరేషన్.. గెజిట్ విడుదల

నల్గొండ ఇకపై ‘మహానగర’ హోదాలో రూపాంతరం చెందనుంది. మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పట్టణాభివృద్ధిలో నవశకం ప్రారంభం కానుంది. కార్పొరేషన్ హోదాతో అదనపు నిధులు రావడమే కాకుండా, రోడ్ల విస్తరణ, భూగర్భ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


