News December 27, 2025

WGL: అభివృద్ధి ఒక వైపేనా..!

image

గ్రేటర్ వరంగల్ నగరం పేరుకే గ్రేటర్‌లా ఉంది. అభివృద్ధి అంతా ఒక వైపే జరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారు.వరంగల్ తూర్పు, వర్ధన్నపేటలో మాత్రం ఇప్పటికీ రూ.100 కోట్ల లోపే పనులకు శంకుస్థాపనలు జరిగినట్టు ప్రజలు చెబుతున్నారు. వరంగల్ పశ్చిమలో నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుండగా.. మిగిలిన 2 ప్రాంతాల్లో కనిపించకపోవడం గమనార్హం.

Similar News

News January 14, 2026

సింగర్ మరణం.. మద్యం మత్తులోనే జరిగిందన్న సింగపూర్ పోలీసులు

image

అస్సాం సింగర్ జుబీన్ గార్గ్ మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని సింగపూర్ పోలీసులు తేల్చినట్లు ఆ దేశ కోర్టు వెల్లడించింది. ‘జుబీన్ మద్యం మత్తులో ఉన్నాడు. వేసుకున్న లైఫ్ జాకెట్ విప్పేశాడు. మళ్లీ ఇస్తే వేసుకోలేదు’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో సింగపూర్ వెళ్లిన జుబీన్ స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోగా, ఆయన్ను హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి.

News January 14, 2026

పట్టువర్ధనంలో పండగ వేళ విషాదం

image

వంగర మండలం పట్టువర్ధనంలో బుధవారం పండగ పూట విషాదం నెలకొంది. గ్రామస్థుడు రాజు కుమార్ (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితులతో కలసి పడవపై మడ్డువలస రిజర్వాయర్‌లో ప్రయాణించాడు. ప్రమాదవశాత్తు మధ్యలో పడవ బోల్తా పడగా..ఈత రాక రాజు కుమార్ నీట మునిగి మృతి చెందాడు. భార్య వాణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం డెడ్ బాడీని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు.

News January 14, 2026

NGKL: జిల్లాలో 847 టన్నుల యూరియా నిల్వలు

image

జిల్లాలో 847 టన్నుల యూరియా విలువలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపు లేదా ఎల్లుండి జిల్లాకు 1,771 టన్నుల కోరమండల్, స్పీక్ కంపెనీల యూరియా జడ్చర్ల రేక్ పాయింట్ ద్వారా జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఈ నెలలో మరో 4,349 టన్నుల యూరియా రానుందని పేర్కొన్నారు. జిల్లాలో మొక్కజొన్న విస్తీర్ణం 6 రేట్లు పెరిగినందున యూరియాకు డిమాండ్ పెరిగిందని తెలిపారు.