News April 24, 2024
కేక్ తిని బాలిక మృతి.. దర్యాప్తులో ఏం తేలిందంటే?

పంజాబ్‌లో మాన్వి అనే బాలిక బర్త్‌డే రోజు కేక్ తిని <<12955452>>మృతి<<>> చెందిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో ఆమె మృతికి గల కారణాలు వెల్లడయ్యాయి. కేక్‌లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ‘సాచరైన్’ను అధిక మోతాదులో వాడినట్లు అధికారులు నిర్ధారించారు. సాధారణంగా ఆహారం, పానీయాలలో దీనిని తక్కువ మొత్తంలో వాడతారు. కేక్‌లో ఎక్కువగా వాడటంతో తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. కేక్ తయారు చేసిన బేకరీపై పోలీసులు FIR నమోదు చేశారు.
Similar News
News January 28, 2026
‘నల్లమలసాగర్’పై ఢిల్లీ వేదికగా పోరు

TG: AP నిర్మించతలపెట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్టుపై పోరాట వ్యూహాన్ని తెలంగాణ GOVT మార్చింది. JAN30న ఢిల్లీలో కేంద్రం నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలోనే వీటిపై తేల్చుకోవాలని నిర్ణయించింది. ఈ భేటీలో 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండడంతో AP ప్రాజెక్టులు అక్రమమని నిరూపించే ఆధారాలను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులను నిలువరించకుంటే భేటీకి హాజరు కాబోమని TG ఇంతకుముందు పేర్కొంది.
News January 28, 2026
ఫ్లైట్లు/హెలికాప్టర్లు కూలగానే ఎందుకు కాలిపోతాయి?

ఫ్లైట్లు/హెలికాప్టర్లు కూలగానే క్షణాల్లో మంటలు చెలరేగడం, అందులో ప్రయాణికులు చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం వాటిల్లో అధిక మోతాదులో ఉండే ఇంధనం. ఫ్లైట్లు/హెలికాప్టర్లు తీవ్రమైన వేగం/ఘర్షణతో కదులుతుంటాయి. ఆ సమయంలో ప్రమాదం జరిగితే రెక్కలు లేదా ట్యాంకులు పగిలి ఇంధనం బయటకు వస్తుంది. ఇంజిన్ వేడికి లేదా రాపిడి వల్ల వచ్చే నిప్పురవ్వలతో తక్షణమే మంటలు వ్యాపిస్తాయి.
News January 28, 2026
ఈనెల 31న ఆన్లైన్ జాబ్ మేళా

AP: పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో జనవరి 31న ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18 సంవత్సరాలు నిండిన ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైనవారు అర్హులు. రెండు కంపెనీల్లో 180 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8


