News December 27, 2025
భారీ స్కాంలో చిత్తూరు జిల్లా ఫస్ట్.!

చిత్తూరు జిల్లాలో నకిలీ GST స్కాంలో రూ.118.70 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. వివిధ కంపెనీల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొల్లగొట్టారు. వాటి వివరాలు: ☞ లలిత ట్రేడర్స్-రూ.25.43 కోట్లు ☞ RP ఎంటర్ప్రైజెస్-రూ.15.98కోట్లు ☞ తాజ్ ట్రేడర్స్-రూ.13.37 కోట్లు ☞మహాదేవ్ ఎంటర్ప్రైజెస్- రూ.9.54 కోట్లు. మరింత సమాచారం కోసం <<18683267>>క్లిక్<<>> చేయండి.
Similar News
News December 29, 2025
పుర పోరుకు సూర్యాపేట సిద్ధం.!

SRPT జిల్లాలోని 5 మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారిక జాబితా వెల్లడించింది. సూర్యాపేటలో 48 వార్డులు, జనాభా 1,33,399, ఎస్టీ 20393, ఎస్సీ 10471గా ఉంది. HNRలో 28 వార్డులు, జనాభా 35,850, ఎస్టీ 537 ఎస్సీ 4219 , కోదాడ లో 35 వార్డులు, జనాభా 75,093, ఎస్టీ 4185, ఎస్సీ 10,556, తిరుమలగిరి 15 వార్డులు, జనాభా 18,474 , ఎస్టీ 1607, ఎస్సీ 3671, నేరేడుచర్ల వార్డులు 15 జనాభా 14,853, ఎస్టీ 394, ఎస్సీ 3183గా ఉన్నారు.
News December 29, 2025
భువనగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి

భువనగిరి జిల్లాలోని 6 పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక జాబితా వెల్లడించింది. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు, జనాభా ఓటర్లు 47913, మోత్కూరు 12 వార్డులు, ఓటర్లు 14423, ఆలేరు 12 వార్డులు, ఓటర్లు 13526, చౌటుప్పల్ 20 వార్డులు ఓటర్లు 27300, పోచంపల్లి 13 వార్డులు, ఓటర్లు 15665, యాదగిరిగుట్ట 12 వార్డులు, ఓటర్లు 13526గా నమోదయ్యాయి.
News December 29, 2025
సిరిసిల్ల: సీఎస్, ఉత్తమ్‌కు కేటీఆర్ ఫోన్

కాళేశ్వరం 11వ ప్యాకేజీ కాలువల నిర్మాణం కోసం భూమిని సేకరించి, దానికి సంబంధించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తంగళ్లపల్లి మండల మాజీ సర్పంచులు ఆయనను కలిసి సమస్యను వివరించడంతో ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావులతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.3.19 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.


