News December 27, 2025

భూపాలపల్లి నుంచి మేడారానికి బస్సులు

image

భూపాలపల్లి నుంచి మేడారానికి ముందస్తు బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ ఇందు తెలిపారు. భూపాలపల్లి నుంచి మేడారానికి ఉదయం 8, 9 గం.లకు, సాయంత్రం 4.10, 5.10 ని.లకు తిరిగి మేడారం నుంచి ఉదయం 10.40, 11.40 ని.లకు, సాయంత్రం 6.45, 7.45 ని.లకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బస్సులు గణపురం, ములుగు, పస్రా, తాడ్వాయి మీదుగా వెళ్తాయని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News December 30, 2025

పుతిన్ నివాసంపై దాడి చేయలేదు: ఉక్రెయిన్

image

తమ అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడికి <<18706923>>యత్నించారన్న<<>> రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఖండించారు. అంతా అబద్ధమని, ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడులను సమర్థించుకునే కల్పితకథ అని మండిపడ్డారు. ‘ట్రంప్ టీమ్‌తో కలిసి మేం సాధించిన దౌత్య ప్రయత్నాల విజయాలను దెబ్బతీసేందుకు రష్యా ప్రమాదకర ప్రకటనలు చేస్తోంది. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తోంది’ అని ఆరోపించారు.

News December 30, 2025

మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామానికి చెందిన మల్లప్పగారి హేమంత్ సాయి (21) మృతిచెందినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. హేమంత్ సాయి శనివారం రాత్రి కుక్కదువు ప్రవీణ్ (20), మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్దీప్‌తో కలిసి బైక్‌పై మేడ్చల్ బయలుదేరారు. మార్గమధ్యంలో ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో హేమంత్ సాయి మృతిచెందగా, ఇరువురు గాయపడ్డారు.

News December 30, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 30, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:16 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:52 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:09 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.