News December 27, 2025
APPLY NOW: NHIDCLలో ఉద్యోగాలు

NHIDCLలో 64 అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com
Similar News
News January 19, 2026
శివపార్వతుల నిత్య నివాసం, మోక్ష క్షేత్రం ‘వారణాసి’

పురాణాల ప్రకారం.. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు కైలాసం వదిలి గంగాతీరంలోని కాశీని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. అందుకే కాశీ శివపార్వతుల గృహంగా, మోక్ష నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి విశ్వనాథ జ్యోతిర్లింగ దర్శనం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. జీవన్మరణాల సంగమమైన ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.
News January 19, 2026
సంక్రాంతి ముగిసింది.. రొటీన్ లైఫ్ మొదలైంది

సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టమైనా సరే పల్లెలు విడిచి తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితంలోకి అడుగు పెట్టేశారు. బాస్ మెప్పు కోసం తిప్పలు, కెరీర్ వెనుక పరుగులు, నైట్ షిఫ్టులతో కుస్తీలు పడాల్సిందే. ఈ ఏడాది సొంతూరులో గడిపిన క్షణాలు, అమ్మానాన్న ఆప్యాయతలు, అయినవాళ్ల పలకరింపులను మనసులో దాచుకుని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు వాటినే నెమరువేసుకోవాలి!
News January 19, 2026
24% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు

భారత్ నుంచి 2025లో ఆటోమొబైల్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2024లో 50,98,474 వాహనాల ఎగుమతి జరగ్గా.. గతేడాది ఆ సంఖ్య 63,25,211(24.1%)కు చేరింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతి 16%, యుటిలిటీ వెహికల్స్ 32శాతం, కార్ల ఎగుమతులు 3% మేర పెరిగాయి. వీటిలో 3.95 లక్షల యూనిట్లు ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది.


