News December 27, 2025
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీసు

నల్గొండ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించింది. నల్గొండ నుంచి ప్రతి రోజు ఉదయం 6.15 గంటలకు బస్సు బయలుదేరుతుందని ఆర్టీసీ డీపో మేనేజర్ ఎంవీ రమణ శనివారం తెలిపారు. ఎక్స్ ప్రెస్ బస్సు స్థానంలో డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 31, 2025
NLG: టీఎస్ ఐసెట్ నిర్వహణ MGUకే

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి 2026-27 విద్యా సంవత్సరంలో నిర్వహించే ‘టీఎస్ ఐసెట్-2026 నిర్వాహణ బాధ్యతను నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీకే అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఐసెట్ కన్వీనర్ గా ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్, రిజిస్ట్రార్ ప్రొ. అల్వాల రవిని నియమించారు.
News December 31, 2025
నల్గొండ: మిషన్ భగీరథ కార్మికుల డిమాండ్లు ఇవే

నల్గొండ పట్టణం పానగల్లులోని ఎస్ఈ ఆఫీసులో మిషన్ భగీరథ కార్మికులతో అధికారులు, కాంట్రాక్టర్స్ సంయుక్త సమావేశం నిర్వహించారు. కార్మికులు తమ డిమాండ్లను అధికారులు, కాంట్రాక్టర్స్ ముందుంచారు. ప్రస్తుత వేతనంపై రూ.2 వేలు పెంచాలని, ప్రతినెల 5 లోపల వేతనం చెల్లించాలని, ఏడాదికి 2సార్లు బోనస్, కార్మికులకు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ నుంచి గుర్తింపు కార్డులు, డ్రెస్ కోడ్ ఇవ్వాలన్నారు.
News December 31, 2025
NLG: మున్సిపాలిటీలో ఎన్నికల వే’ఢీ’..!

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని అందరూ భావించారు. ఎవరు ఊహించని విధంగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఆశావహుల సందడితో ఎన్నికల వేడి మొదలైంది.


