News December 27, 2025
కృష్ణా: మామ చేతిలో అల్లుడు దారుణ హత్య.!

తోట్లవల్లూరు మండలం పెనమకూరులో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో మామ చీకుర్తి శ్రీనివాసరావు కర్రతో కొట్టగా అల్లుడు ఆదిమూలపు సురేశ్ (31) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో విజయవాడలో నివసించేవాడు. ఇటీవల కుమార్తె మృతి నేపథ్యంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 1, 2026
పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 40% GST.. FEB 1 నుంచి..

ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, పొగాకు <<18695704>>ఉత్పత్తులపై<<>> నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ మసాలాపై 40% జీఎస్టీతో పాటు సెస్ విధించనుంది. అటు పొగాకు ఉత్పత్తులపై అదనంగా ఎక్సైజ్ డ్యూటీ అమలు కానుంది. అయితే బీడీలపై మాత్రం 18శాతం జీఎస్టీ ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
News January 1, 2026
భారీ జీతంతో ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(EIL)లో 22 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 2 ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే నెలకు AGMకు రూ.1లక్ష-రూ.2,60,000, Sr.మేనేజర్‌కు రూ.90,000-రూ.2,40,000, మేనేజర్‌కు రూ.80,000-రూ.2,20,000, dy.మేనేజర్‌కు రూ.70,000-రూ.2,000000 చెల్లిస్తారు.
News January 1, 2026
మారింది డేటే.. ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే

క్యాలెండర్‌లో మారింది డేట్ మాత్రమే. మీ జీవితం కూడా మారాలని కోరుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉంది. బలమైన ఆశయం, సంకల్పం, శ్రద్ధతో పని చేస్తే ఆలస్యమైనా విజయం మిమ్మల్ని చేరక తప్పదు. ఇయర్ మారింది.. మన టైమ్ కూడా మారుతుందని ఊరికే ఉంటే ఇంకో ఇయర్ వచ్చినా డేట్‌లో మార్పు తప్ప జీవితంలో కూర్పు ఉండదు. సో.. నేర్పుగా వ్యవహరిస్తే ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే..
ALL THE BEST


