News December 27, 2025

నిడదవోలు: అంగన్‌వాడీలకు స్మార్ట్ ఫోన్లు

image

నిడదవోలు నియోజకవర్గ అంగన్‌వాడీ టీచర్లకు మంత్రి కందుల దుర్గేశ్ శనివారం స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేశారు. అంగన్‌వాడీ సేవలు మరింత పారదర్శకంగా ఉండటానికి ఈ ఫోన్లు దోహదపడతాయన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందించే ఆరోగ్య సేవలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో సేవల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 1, 2026

‘జిల్లాలో 12% పెరిగిన రోడ్డు ప్రమాదాలు’

image

గడిచిన ఏడాదితో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు 12% పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.2024 లో 309 ప్రమాదా లు సంభవిస్తే 39 మంది మృతి చెందగా, 624 మంది గాయపడ్డారు.2025 లో 309 రోడ్డు యాక్సిడెంట్లైతే 335 మంది మృతి చెందగా 728 మంది క్షతగాత్రులయ్యారని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ, అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, తాగి వాహనాలు నడపడం మూలంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.

News January 1, 2026

2025లో జిల్లాలో ఏ నేరాలు ఎన్ని జరిగాయో తెలుసా..?

image

జిల్లాలో గత ఏడాదితో పోల్చితే 2025 సంవత్సరంలో 15% ప్రమాదాలు తగ్గాయని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. 2024లో 7,586 కేసులు నమోదైతే, 2025లో 6,477 నమోదైనట్లు తెలిపారు. సైబర్ నరాలు 140 నుంచి 123కి, పోక్సో కేసులు 114 నుంచి 110కి, ఆర్థిక నేరాలు 355 నుంచి 302కి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 101 నుంచి 64కి, మాదకద్రవ్యాల కేసులు 69 ఉంటే 52కి, శారీరిక నేరాలు 76 నుంచి 697కు తగ్గాయన్నారు.

News January 1, 2026

గోదావరిలో దూకబోయిన తల్లి, కూతురు.. కాపాడిన పోలీసులు

image

కొవ్వూరు గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, పదేళ్ల కుమార్తెను శక్తి టీం పోలీసులు బుధవారం కాపాడారు. 112 నంబర్ నుంచి అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఈ అఘాయిత్యానికి సిద్ధపడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.