News December 27, 2025

HYD: ఆశ్చర్యం.. కంటైనర్‌లో వైన్ షాప్

image

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే కంటైనర్‌లోనే వైన్ షాప్ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజూరైన ఓ వైన్ షాప్ రెడీ కాకపోవడంతో దుకాణదారుడు రోడ్డు పక్కనే కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ప్రధాన రహదారిపై ఇలా కంటైనర్‌లో వైన్ షాప్ నడపడం చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 13, 2026

వివేకా హత్య కేసులో YS సునీత మరో అప్లికేషన్

image

వివేకా హత్యకేసులో ఆయన కుమార్తె YS సునీత SCలో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాక్షికంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమె సవాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా HYD CBI కోర్టు పాక్షిక విచారణకు ఆదేశించినట్లు అప్లికేషన్‌లో పేర్కొన్నారు. విచారణను SC వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా CBI విచారణ కొనసాగింపుపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC గతంలోనే ట్రయల్ కోర్టును ఆదేశించింది.

News January 13, 2026

మాజీ మంత్రి సతీమణి లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం

image

దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవిని ఓదార్చారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వివాహాన్ని తానే దగ్గరుండి చేయించానన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని బావోధ్వేగానికి గురయ్యారు.

News January 13, 2026

NTR: యువతి ఆధార్ చోరీ చేసి లోన్.. ఆపై టోకరా..!

image

గుణదలకు చెందిన సాయి కిరణ్ అనే వ్యక్తి తన ఆధార్ కార్డుని తనకు తెలియకుండానే తీసుకుని లోన్ యాప్‌లో రూ.1లక్ష తీసుకున్నాడని యువతి ఆరోపించారు. తిరిగి చెల్లించక పోవడంతో కో అప్లికేంట్‌ కింద తనను యాడ్ చేయడంతో లోన్ యాప్ వాళ్లు వేధిస్తున్నట్లు తెలిపారు. బాధిత యువతి మాచవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. తన ఆధార్, సంతకం ఫోర్జరీ చేశారని బాధితురాలు వాపోయారు.