News December 27, 2025
పిల్లలకు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తుంటే..

ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలో జ్వరంతో పాటు కొందరికి ఫిట్స్ వస్తుంది. రోజులో రెండు, మూడు సార్లు వస్తే మాత్రం సీరియస్గా తీసుకోవాలి. తల్లిదండ్రులకు చిన్నప్పుడు ఫిట్స్ ఉంటే అదీ పిల్లలకు వంశపారపర్యంగా వస్తుంది. జ్వరంతోపాటు తలనొప్పి, వాంతులు, చురుకుగా ఉండకపోవడం, బీపీ తగ్గిన సమయంలో ఫిట్స్ వస్తే మాత్రం సీరియస్గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మెదడువాపు వ్యాధి లక్షణాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
Similar News
News January 25, 2026
అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు సీఎం దిశానిర్దేశం

AP: కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన నిధులను సాధించడంపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్, రాష్ట్ర మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.
News January 25, 2026
APPLY NOW: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

<
News January 25, 2026
తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ పగ్గాలు

రాష్ట్రీయ జనతాదళ్(RJD) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వీ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ డిప్యూటీ సీఎంగా అనుభవం ఉన్న తేజస్వి ఇకపై పార్టీ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నారు.


