News December 27, 2025
వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
Similar News
News December 29, 2025
వరి నారుమడిని చలి నుంచి ఎలా రక్షించుకోవాలి?

చలి తీవ్రత పెరిగి రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వరి నారుమడుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో భాగంగా రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. నారు దెబ్బతినకుండా రోజూ ఉదయాన్నే మడిలో చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్త నీరు పెట్టాలి.
News December 29, 2025
పోలీసుల్నే బురిడీ కొట్టించారు.. ₹లక్షలు స్వాహా!

ఆన్‌లైన్ మోసాల కేసులు చూసే సైబర్ క్రైమ్ పోలీసులే డబ్బు పోగొట్టుకున్నారు. TTD దర్శన టికెట్స్ కోసమని ఓ అధికారి ₹4 లక్షలు కోల్పోయారు. ఇక స్టాక్స్‌లో లాభాలు అని ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయగా మరో ఇన్‌స్పెక్టర్ ₹39L నష్టపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆ ఆఫీసర్స్ ఇద్దరూ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఈ పోలీసుల అతి నమ్మకం, అత్యాశ తప్ప దొంగల అతి తెలివేం లేదు.
News December 29, 2025
రైతా ఎంత పనిచేసింది.. 200 మందికి రేబీస్ వ్యాక్సిన్లు

UPలోని బదౌన్ జిల్లా పిప్రౌలి గ్రామస్థులు రేబీస్ భయంతో వణికిపోతున్నారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన ఓ విందులో రైతా(పెరుగు పచ్చడి) వడ్డించారు. అయితే ఆ రైతాకు కుక్క కాటుకు గురైన ఓ గేదె పాలను ఉపయోగించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ గేదె రేబీస్ లక్షణాలతో మృతిచెందడంతో అధికారులు మొత్తం 200 మందికి యాంటీ రేబీస్ టీకాలు వేశారు. భయపడాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపారు.


