News April 24, 2024
రికార్డు సృష్టించిన బౌల్ట్
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రికార్డు సృష్టించారు. IPLలో మొదటి ఓవర్‌లోనే అత్యధిక వికెట్లు(26*) తీసిన బౌలర్‌గా నిలిచారు. తొలి ఓవర్‌లో 5వ బంతికి రోహిత్‌ను ఔట్ చేసి బౌల్ట్ ఈ ఫీట్ సాధించారు. దీంతో భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు(25వికెట్లు) చెరిగిపోయింది. ఇదిలా ఉంటే T20ల్లో హిట్‌మ్యాన్‌ను బౌల్ట్ 6సార్లు ఔట్ చేశారు.
Similar News
News November 20, 2024
అర్హపై అభినందనలు.. అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్
‘అన్‌స్టాపబుల్’లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూతురు అర్హ తెలుగు పద్యంతో హోస్ట్ బాలకృష్ణతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఎంతో క్లిష్టమైన ‘అటజని కాంచె’ పద్యాన్ని గుక్కతిప్పుకోకుండా చెప్పడంతో అర్హపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో తాజాగా బన్నీ ఓ పోస్ట్ చేశారు. ‘అల్లు అర్హ అంటే నాన్న కూతురు అనుకుంటివా.. నాన్న(అల్లు) యువరాణి’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.
News November 20, 2024
అధికారులపై స్పీకర్ అయ్యన్న ఫైర్
AP: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. వారి నిర్లక్ష్యంతోనే అసెంబ్లీలో గందరగోళం నెలకొందని ఆయన ఫైర్ అయ్యారు. ‘అధికారులు తమ శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారు? ఒకే మంత్రికి ఒకే సమయంలో రెండు సభల్లో ఎలా ప్రశ్న వేస్తారు. ప్రశ్న ఒకటి. మంత్రిత్వ శాఖ మరొకటి ఉంటుంది. మరోసారి ఇలాంటివి రిపీట్ కానివ్వొద్దు’ అని ఆయన మండిపడ్డారు.
News November 20, 2024
దేశ రాజధానిని మార్చడం సాధ్యమేనా?
కాలుష్య మయమైన ఢిల్లీని రాజధానిగా కొనసాగించడం అవసరమా అని కాంగ్రెస్ MP శశిథరూర్ లేవనెత్తిన ప్రశ్న చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే పలు కారణాలతో 8 దేశాలు తమ రాజధానులను మార్చాయి. నైజీరియా(లాగోస్-అబుజా), మయన్మార్(రంగూన్-నైపిడావ్), రష్యా(సెయింట్ పీటర్స్‌బర్గ్-మాస్కో), పాకిస్థాన్(కరాచీ-ఇస్లామాబాద్), బ్రెజిల్(రియో డి జనీరో-బ్రెసిలియా), కజకిస్థాన్, టాంజానియా, ఐవరీ కోస్ట్ సైతం తమ రాజధాని నగరాలను మార్చాయి.