News April 24, 2024

నారాయణ అప్పులు రూ.62.43 కోట్లు

image

TDP నెల్లూరు సీటీ అభ్యర్థి నారాయణ 77 పేజీలతో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన స్థలాల వివరాలకే దాదాపు 50 పేజీలు ఉపయోగించారు. ఆయన దగ్గర బంగారం లేకపోయినా భార్య దగ్గర రూ.22.76 కోట్ల విలువైన 35.929 కేజీల బంగారం ఉందని ప్రకటించారు. తన అప్పులు రూ.62.43 కోట్లు, భార్య పేరిట రూ.127.16 కోట్లు ఉన్నట్లు చూపారు. తనపై CID, పేపర్ లీకేజీతో పాటు నారాయణ విద్యా సంస్థలో విద్యార్థి సూసైడ్ కేసు ఉందని పేర్కొన్నారు.

Similar News

News March 7, 2026

నెల్లూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.16 లక్షల నగదు చోరీ

image

కొండాయపాలెం నందనవనానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ రెడ్డి బీరువాలో ఉన్న రూ. 16.50 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు చోరీకి గురైందని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసిస్టెంట్ శ్రీనివాసులు అనే వ్యక్తికి నగదుబీరువాలో ఉంచమని ఇచ్చారు. అనంతరం నిద్రపోయే లేచి చూడగా బీరువాలో నగదు, బంగారు, పార్కింగ్‌లో ఉన్న బైక్ కనపడలేదని అన్నారు. తన అసిస్టెంట్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు.

News March 7, 2026

నెల్లూరులో 9న ‘మహిళా జన సున్వాయి’

image

మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న నెల్లూరు జడ్పీ మీటింగ్ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మహిళా జన సున్వాయి’ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్‌లో జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొని గృహ హింస, వేధింపులపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

News March 6, 2026