News April 24, 2024
మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైన ఓ మహిళను పోలీసులు కాపాడారు. భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్త గొడవపడ్డాడని పట్టణ పరిధిలోని రైల్వే ట్రాక్ పైకి వెళ్తుండగా గమనించిన పోలీసులు ఆ సదరు మహిళను అడ్డుకొని నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులను జిల్లా వాసులు తోటి పోలీస్ సిబ్బంది అభినందిస్తున్నారు.
Similar News
News March 18, 2026
రాముడి పాదంతో రామడుగుగా మారింది ఈ గ్రామం

అనుముల మండలంలోని రామడుగు గ్రామం భక్తి విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణాల ప్రకారం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ అడుగు పెట్టడంతో గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చింది. అహల్య వాగులో ఉన్న రాముడి పాదం ఈ గాథకు నిదర్శనంగా భావిస్తారు. భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి విశేష భక్తిని చాటుకుంటున్నారు.
News March 18, 2026
నల్గొండ: రేషన్ ఇచ్చే గడువు పొడిగింపు

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈనెల 19 వరకు రేషన్ తీసుకునే గడువును పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ రఘునందన్ తెలిపారు. డీలర్లు షాపులను సమయానికి తెరిచి ఉంచాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News March 18, 2026
బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.


