News December 27, 2025
బొకేలు వద్దు.. పేద విద్యార్థులకు ‘చేయూత’ ఇవ్వండి: కలెక్టర్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపే వారు, ఆ ఖర్చును సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం వెచ్చించాలని జిల్లా కలెక్టర్ షామ్మోహన్ కోరారు. జిల్లాలోని 100 ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో చదువుతున్న 15వేల మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, దోమతెరలు లేదా ఇతర వసతుల కల్పనకు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆడంబరాలకు బదులు పేద విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
Similar News
News January 2, 2026
నిమిషంలోనే అంబులెన్స్ బయల్దేరింది: శ్రీకాకుళం DMHO

రణస్థలం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో 108 అంబులెన్స్ సేవలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని DMHO డా.అనిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ రాకలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని సాంకేతిక సమస్య వలన సమాచారం చేరడం జాప్యం జరిగిందని ఆమె వెల్లడించారు. 8.08 గంటలకు సమాచారం అందిన వెంటనే 8.09 నిమిషాలకు అంబులెన్స్ బయలుదేరి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 5 నిమిషాల్లోనే చేరిందన్నారు.
News January 2, 2026
ఎన్నికల్లో పోటీ చేస్తాం: గురునాథరెడ్డి

వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం కచ్చితంగా పోటీ చేస్తుందని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ప్రకటించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నుంచి ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు. తాము నిరంతరం ప్రజలతోనే ఉండి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా గురునాథరెడ్డి 2009 ఎన్నిక, 2012 ఉప ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
News January 2, 2026
రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్‌గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్‌నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించారు.


