News December 27, 2025
NRPT జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా ప్రతీక్ జైన్

నారాయణపేట జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ నెల 17 నుంచి జనవరి 11 వరకు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో, ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 2, 2026
మన మిలిటరీ స్థావరాలపై పాక్ ఫేక్ ప్రచారం!

పాక్ మరోసారి తన నక్క బుద్ధి చూపించింది. ప్రో పాకిస్థాన్ SM అకౌంట్ల ద్వారా ఫేక్ ప్రచారానికి తెరలేపింది. గతేడాది మే నెలలో యుద్ధం సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌బేస్, బియాస్‌లోని బ్రహ్మోస్ స్థావరంపై దాడి చేసినట్లు ఆయా అకౌంట్లలో పోస్టులు చేశారు. దాడికి ముందు, తర్వాత అంటూ తప్పుడు చిత్రాలను షేర్ చేశారు. కానీ ఆ నిర్మాణాలు ఎప్పటిలానే ఉన్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా స్వతంత్ర నిపుణులు తేల్చారు.
News January 2, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 02, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:46 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 2, 2026
చిత్తూరు MPకి 94 శాతం హాజరు

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.


