News April 24, 2024
బైక్‌పై నామినేషన్‌కు బయలుదేరిన ఏలూరి

పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్‌పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్‌ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.
Similar News
News March 18, 2026
ప్రకాశం: ‘22 గ్రామాల సమస్య.. పట్టించుకోండి’

పొన్నలూరు (M)లోని 22 గ్రామాల సమస్య ఇది. కరోనా కష్టకాలంలో యూజర్లను తమవైపు తిప్పుకున్న నెట్‌వర్క్‌లు ప్రస్తుతం మూలనపడ్డాయి. ప్రధానంగా K.అగ్రహారంలో కొద్దిరోజులక్రితం సెల్ టవర్లు తీసేశారు. ప్రస్తుతం ఆ ప్రాంత వాసుల పరిస్థితి అడవుల్లో జీవిస్తున్నట్లే ఉంది. దీంతో సచివాలయ, బ్యాంక్ సేవలు సైతం డల్ అయ్యాయి. ఇదే ప్రాంతంలో BSNL టవర్ నిరుపయోగంగా ఉంది. 10 రోజులుగా కాల్స్ కూడా రావట్లేదని యూజర్ల ఆరోపిస్తున్నారు.
News March 18, 2026
ప్రకాశం: 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నందిని

ప్రకాశం(D) మద్దిపాడు(M) అన్నంగి గ్రామానికి చెందిన మల్లవరపు నందిని ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఫిబ్రవరి 23న RRB (PO), Feb 27న SBI (JA), మార్చి 2న UBI (CSA), March 15న RRB (Clerk) ఉద్యోగాలు పొందింది. శంకరాచారి, మస్తానమ్మలకు ముగ్గురు కుమార్తెలు కాగా, నందిని చివరి అమ్మాయి. ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ పట్టుదలతో విజయం సాధించారు. 4 ఉద్యోగాలు సాధించిన ఆమె యువతకు ప్రేరణగా నిలిచారు.
News March 18, 2026
ప్రకాశం: ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక అధికారులు

జిల్లాలో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఏప్రిల్ 2 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోందని DPO వెంకటేశ్వరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అధికారుల ద్వారా పాలన సాగుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని 27 మండలాల్లో 519 పంచాయతీలు, మార్కాపురం జిల్లాలో 21 మండలాలకు 405 మంది అధికారులు ఉంటారన్నారు.


