News December 27, 2025
భూపాలపల్లి: పోలీసుల పనితీరు అభినందనీయం: ఎస్పీ

భూపాలపల్లి జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ సంకిర్త్ అభినందించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగడం వల్లనే బాధితులకు న్యాయం చేకూరుతుందని, నేరస్తులకు శిక్షలు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఏడాదిలో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, జిల్లాను నేరరహితంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 31, 2025
హత్యకేసులో టీడీపీ ఎమ్మెల్యేకి నోటీసులు: YCP

AP: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో విచారణ ముమ్మరమైందని YCP పేర్కొంది. ఈ కేసులో TDP MLA బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డిని విచారించి స్టేట్‌మెంట్ నమోదు చేసినట్లు వెల్లడించింది. రాయుడు హత్య వెనుక రాజకీయ కోణం ఉందని, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించింది.
News December 31, 2025
తాడ్వాయిలో వన కుటీరాలను ప్రారంభించిన సీతక్క

అటవీ శాఖ ఆధ్వర్యంలో తాడ్వాయిలో నూతనంగా నిర్మించిన వన కుటీరాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇప్పటికే ఇక్కడున్న ఫారెస్ట్ పార్కును సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు. సఫారీ రైడ్‌ను పున: ప్రారంభించారు. మేడారం జాతర నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తుండగా తాడ్వాయి హట్స్ వారికి మర్చిపోని అనుభూతిని కలిగిస్తుందని మంత్రి అన్నారు. ములుగును పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.
News December 31, 2025
హడావుడిగా శివలింగం ప్రతిష్ఠాపన చేయడమేంటి?: పిల్లి సుభాష్

ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో శివలింగం ధ్వంసమైన ఘటనను వైసీపీ నేతల బృందం బుధవారం పరిశీలించింది. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. జరిగిన అపచారాన్ని కప్పిపుచ్చేందుకు హడావుడిగా శివలింగ ప్రతిష్ఠ చేయడాన్ని విమర్శించారు. టీడీపీ హయాంలో ఆలయాలపై దాడులు పెరిగాయని ఆరోపిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


