News April 24, 2024
ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధం.. బీజేపీ నుంచి బహిష్కరణ

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న కర్ణాటక బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్పను ఆ పార్టీ బహిష్కరించింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తన కొడుక్కి పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై శివమొగ్గ నుంచి పోటీకి సిద్ధమయ్యారు.
Similar News
News March 21, 2026
వాహనదారులకు రిలీఫ్.. ఎల్లుండి నుంచి..

TG: ఒకే పేరుపై రెండో వాహనం కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 23 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ఇక అదే రోజున రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ లాంచ్ చేయనున్నారు. రాష్ట్ర వాహనాల డేటా ఆ పోర్టల్‌తో అనుసంధానం కానుంది. దీంతో అంతర్రాష్ట్ర వాహనాల కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఈజీ అవుతుంది.
News March 21, 2026
విడాకులపై స్పందించిన నిహారిక

తాను రిలేషన్‌షిప్ నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు ముందుగా తన తండ్రికే చెప్పానని మెగా డాటర్ నిహారిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన మొత్తం విని సైలెంట్ అయ్యారని, తాను సంతోషంగా లేననే విషయం వాళ్లకూ తెలుసన్నారు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. తమ మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించుకోలేనివని, అందుకే 2023లో విడాకులు తీసుకున్నామని చెప్పారు.
News March 21, 2026
డియాగో గార్సియాపై ఇరాన్ దాడి.. ఖండించిన బ్రిటన్

ఇండియన్ ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్ డియాగో గార్సియాపై <<19440362>>ఇరాన్ దాడిని<<>> బ్రిటన్ ఖండించింది. అలాగే గల్ఫ్ దేశాలపై దాడులను తప్పుపట్టింది. హార్ముజ్ జలసంధిని మూసేయడాన్ని తమకు, తమ మిత్ర దేశాలకు ముప్పుగా అభిప్రాయపడింది. ఈ యుద్ధంలో బ్రిటన్ నేరుగా పాల్గొనకపోయినా తమ స్థావరాలను వాడుకునేందుకు అమెరికాకు అనుమతించిన విషయం తెలిసిందే. అందుకే డియాగో గార్సియాను ఇరాన్ టార్గెట్ చేసింది.


