News December 27, 2025

భద్రాద్రి జిల్లాలో లొంగిపోయిన 300 మంది మావోయిస్టులు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో 2025 సంవత్సరపు వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో నలుగురు మావోయిస్టులను అరెస్టు చేయగా, మరో 300 మంది లొంగిపోయినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని, నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు.

Similar News

News December 28, 2025

జెప్టో.. రూ.11 వేల కోట్లకు IPO

image

క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి డాక్యుమెంట్లు సమర్పించింది. ఈ IPO ద్వారా సుమారు రూ.11వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026లో మార్కెట్లో లిస్టింగ్ కావాలని భావిస్తోంది. కాగా 2020లో అదిత్, కైవల్య ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దీని విలువ 7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే దీని పోటీదారులైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ (జొమాటో) లిస్ట్ అయ్యాయి.

News December 28, 2025

సంగారెడ్డి: కల్వర్టు గుంతలో పడి ముగ్గురి మృతి

image

నారాయణఖేడ్ పట్టణ శివారులో డబుల్ బెడ్ రూముల వద్ద నిజాంపేట్-బీదర్ 161బి హైవేపై నిర్మిస్తున్న కల్వర్టు గుంతలో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఖేడ్ మండలం నర్సాపూర్‌కి చెందిన అవుటి నర్సింలు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేశ్ (23)గా గుర్తించారు. వీరు ఒకే బైకుపై ఖేడ్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడి మృతి చెందారు.

News December 28, 2025

కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్

image

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.300గా ఉంది. విజయవాడలో కేజీ రూ.280, వరంగల్‌లో రూ.290, గుంటూరులో రూ.260, శ్రీకాకుళంలో రూ.305కి విక్రయిస్తున్నారు. గత వారం HYDలో కేజీ రూ.250 ఉండగా ఇప్పుడు రూ.50 వరకు పెరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కోడిగుడ్డు ధర రూ.8గా ఉంది.