News December 27, 2025
మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎస్పీ

మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. జాతర పనులను పూర్తి చేసి సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు
Similar News
News December 31, 2025
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై మంత్రి అడ్లూరి సమీక్ష

భూపాలపల్లి కేంద్రంగా హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్షా సమావేశం ప్రారంభించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణ రావుతో కలిసి మంత్రి పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, వసతులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రిన్సిపాల్‌లతో చర్చిస్తున్నారు.
News December 31, 2025
ఇక ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై రాయితీలు ఉండవ్!

కేంద్రం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల సబ్సిడీని నిలిపివేసేందుకు సిద్ధమైంది. ఈ విభాగంలో 32% వాహనాలు బ్యాటరీతోనే నడవాలని నిర్దేశించుకున్న PM E-Drive పథకం లక్ష్యం నెరవేరింది. ఇకపై ప్రోత్సాహకాలు అందించే బాధ్యతను రాష్ట్రాలకే వదిలేయాలని యోచిస్తోంది. అయితే టూ-వీలర్ల విషయంలో మాత్రం ఇంకా లక్ష్యం పూర్తి కాలేదు. వాటికి వచ్చే ఏడాది కూడా రాయితీలు కొనసాగే అవకాశం ఉంది. కార్లు, బస్సులకూ ఆదరణ పెరగాల్సి ఉంది.
News December 31, 2025
KNR: ఉద్యమకారులారా భూములను ఆక్రమించుకోండి: కవిత

మానకొండూరు మండలం తమిళ కాలనీలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష భూ పోరాటానికి పిలుపునిచ్చారు. ఉద్యమకారులు 250 గజాల చొప్పున భూములు ఆక్రమించుకోవాలని కవిత తెలిపారు. 12 సంవత్సరాలుగా ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తానని, ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


