News December 28, 2025

జగన్ ఫ్లెక్సీకి మేక బలి కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు!

image

మాజీ CM జగన్‌ ఫ్లెక్సీ వద్ద మేకను బలి ఇచ్చిన ఘటనలో అరెస్టైన ఏడుగురు నిందితులకు తాడేపల్లిగూడెం కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు YCP సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వాముశెట్టి పరమేశ్వరరావు తెలిపారు. నల్లజర్ల మండలం చోడవరంలో చోటుచేసుకున్న ఈవ్యవహారంలో పోలీసులు నిందితులను శనివారం తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరిచారు. నిందితుల తరపు వాదనలు విన్న కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని వాముశెట్టి పేర్కొన్నారు.

Similar News

News January 1, 2026

గోదావరిలో దూకబోయిన తల్లి, కూతురు.. కాపాడిన పోలీసులు

image

కొవ్వూరు గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, పదేళ్ల కుమార్తెను శక్తి టీం పోలీసులు బుధవారం కాపాడారు. 112 నంబర్ నుంచి అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఈ అఘాయిత్యానికి సిద్ధపడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.

News December 31, 2025

నిడదవోలులో విషాదం.. పదేళ్ల బాలుడి మృతి

image

నిడదవోలు మండలం మునిపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అత్తిలి భరత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సమిశ్రగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.