News December 28, 2025

HYD: మందు తాగారా..? స్వీట్ వార్నింగ్

image

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలులో ఉంటారని CP సజ్జనార్ పదే పదే హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మియా.. డ్రింక్ కియా? తో స్టీరింగ్‌కు సలాం బోల్‌కే క్యాబ్ పక్డో’ అని CP సూచించారు. ‘Google cab.. not lawyer’ అంటూ దొరికితే వదలే ప్రసక్తే లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అసలే వీకెండ్.. న్యూఇయర్‌ ఫీవర్ నడుస్తోందని మద్యం తాగి రోడ్డెక్కి చిక్కుల్లో పడకండి.
SHARE IT

Similar News

News December 29, 2025

VJA: రైల్వే ఘటన.. మృతుడి వద్ద రూ. 5.80 లక్షలు

image

ఎలమంచిలిలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదంలో విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వద్ద ఉన్న బ్యాగులో రూ.5.80 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదంలో ఈ నగదులో కొన్ని నోట్లు పాక్షికంగా కాలిపోయాయి. సోమవారం ఉదయం రైల్వే పోలీసులు ఓ సంచిలో ఈ సొమ్మంతా ప్యాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు.

News December 29, 2025

మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్

image

AP: <<18702293>>రాయచోటి<<>>ని జిల్లా కేంద్రంగా తొలగించడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాంప్రసాద్‌రెడ్డితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ‘విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మీరు పోరాడుతున్నారు. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేసే వీలులేకే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు. రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు CM హామీ ఇచ్చారు.

News December 29, 2025

T20Iల్లో సంచలనం.. 4 ఓవర్లలో 8 వికెట్లు

image

T20Iలో భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే రికార్డు సృష్టించారు. మయన్మార్‌తో జరిగిన మూడో T20Iలో 22 ఏళ్ల సోనమ్ నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీశారు. టీ20 ఫార్మాట్‌లో ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ 45 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత్ నుంచి దీపక్ చాహర్ 2019లో ఒక T20 మ్యాచ్‌లో 6 వికెట్లు తీశారు.