News December 28, 2025
భూపాలపల్లి: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎస్పీ

నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి అంకితభావంతో పనిచేసి జిల్లాను నేరరహితంగా తీర్చిదిద్దాలన్నారు,
Similar News
News January 1, 2026
తిరుమలలో నేటి రాత్రి నుంచే FREE దర్శనం?

లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. సర్వ దర్శనం(టోకెన్లు లేకుండా ఫ్రీ ఎంట్రీ) నేటి రాత్రి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే TTD సర్వదర్శనం క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి లైన్ తీసుకోనున్నారు. రద్దీని బట్టి సాయంత్రం నుంచే టోకెన్లు లేని భక్తులను క్యూలోకి అనుమతించే అవకాశం ఉంది. CRO దగ్గర రూములు తీసుకోవచ్చు.
News January 1, 2026
తోటమూల: మైక్ వివాదం.. హిందూ సంఘాల రాస్తారోకో

గంపలగూడెం మండలం తోటమూల చర్చి వద్ద మైక్ సౌండ్ తగ్గించమన్నందుకు హరికృష్ణపై జరిగిన దాడిని నిరసిస్తూ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. తిరువూరు-మధిర ప్రధాన రహదారిపై బైఠాయించిన నిరసనకారులు.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నేతలు కోరారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
News January 1, 2026
పుతిన్ నివాసంపై దాడి అబద్ధం.. రష్యాకు CIA షాక్

తమ అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందన్న రష్యా ఆరోపణలను US గూఢచారి సంస్థ CIA కొట్టిపారేసినట్లు అమెరికన్ మీడియా సంస్థలు తెలిపాయి. వాటి కథనాల ప్రకారం.. ఉక్రెయిన్ లక్ష్యం కేవలం సైనిక స్థావరాలేనని పుతిన్ నివాసం కాదని CIA తెలిపింది. ఈ మేరకు CIA డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ అధ్యక్షుడు ట్రంప్‌నకు నివేదిక సమర్పించారు. ఆధారాలు లేకుండా రష్యా ఆరోపణలు చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


